వరంగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం

ఓ యువకుడు బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లా పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హన్మకొండ ఇన్‌స్పెక్టర్ పి. దయాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన ఎం.వంశీ (22) కూలి పని చేసుకుంటూ గుండ్ల సింగారంలో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం హన్మకొండకు చెందిన బాలిక (13)తో అతడికి పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమిస్తున్నానని బాలికకు మాయమాటలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. అదే రోజు ఉదయం బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ తెలియడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: అయితే బాలికను హన్మకొండ నుంచి కొప్పుల గ్రామానికి బస్సులో తీసుకెళ్లిన వంశీ అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత 20వ తేదీన రాత్రి బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు మందలించడంతో వంశీ అనే వ్యక్తి తన వెంట తీసుకెళ్లినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. Also Read:
By December 24, 2019 at 09:43AM
No comments