Breaking News

అక్రమ సంబంధానికి అడ్డొస్తోందని స్నేహితురాలి గొంతు కోసి..


వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం మీదికి తెచ్చింది. తన అక్రమ సంబంధానికి అడ్డు పడుతోందన్న అక్కసుతో ఓ మహిళ.. ప్రియుడి భార్యపై హత్యాయత్నం చేసింది. రాజధాని చెన్నైలోని కొడుం గైయూర్‌ వేంబులిఅమ్మన్‌ వీధికి చెందిన మునియమ్మాళ్‌, నుంగం బాక్కంకు చెందిన ప్రియ మంచి ఫ్రెండ్స్. దీంతో ప్రియ తరుచూ మునియమ్మాళ్ ఇంటికి వచ్చేది. ఈ క్రమంలో ఆమె భర్త కార్తీక్‌తో ప్రియకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: మునియమ్మాళ్ ఇంట్లో లేని సమయంలో ప్రియ ఆమె ఇంటికి వచ్చి ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు మునియమ్మాళ్‌కు చెప్పడంతో ఆమె ప్రియను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య హెచ్చరికలతో కార్తీక్ ప్రియురాలిని కలవడం మానేశాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న మునియమ్మాళ్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రియ నిర్ణయించుకుంది. Also Read: మునియమ్మాళ్‌ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కోయంబేడు బస్టాండ్‌లో భర్తతో కలిసి బస్సు కోసం వేచి చూస్తుండగా ప్రియ అక్కడికి చేరుకుని గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రియ తనవెంట తెచ్చుకున్న కత్తితో మునియమ్మాళ్‌ గొంతులో పొడిచింది. తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త స్థానికుల సాయంతో కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలు ప్రియను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By December 02, 2019 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chennai-woman-slit-her-lovers-wifes-throat-case-filed/articleshow/72326356.cms

No comments