Breaking News

కాబోయే భార్యతో ఫోన్లో మాటలు.. పక్కా ప్లాన్‌తో దోపిడీ..


కాబోయే అల్లుడే అత్తవారింటికి కన్నం వేశాడు. ఇంట్లో ఉన్న సొమ్ము వివరాలు కాబోయే భార్య ద్వారా తెలుసుకున్న కేటుగాడు చనువుగా ఇంటికెళ్లి చోరీకి తెగబడ్డాడు. పాతబస్తీలోని కాలాపత్తర్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. పాతనగర శివారు శాస్త్రిపురం కింగ్‌కాలనీకి చెందిన సల్మాన్‌ఖాన్‌ (27) సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి కాలాపత్తర్‌కు చెందిన యువతితో వివాహం చేసేందుకు ఇరువైపు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో తరచూ యువతితో సల్మాన్ ఫోన్‌లో మాట్లాడేవాడు. Also Read: ఇలా మాటలు కలిపి వారింట్లో ఉండే నగలు, నగదు విషయాలు యువతి ద్వారా తెలుసుకున్నాడు. అనంతరం అత్తవారి ఇంట్లో దోపిడీ చేయాలని సల్మాన్‌ఖాన్‌ నిర్ణయించుకున్నాడు. కాబోయే అత్తవారి కుటుంబం దర్గాకు వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకొని తన పథకాన్ని అమలు చేశాడు. వారింట్లోని కిటికీని తొలగించి సల్మాన్‌ఖాన్‌ లోపలకు ప్రవేశించాడు. Also Read: బీరువాలో భద్రపరిచిన రూ. 2.20 లక్షల నగదు, బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. దర్గా నుంచి వచ్చిన అత్తగారి కుటుంబం చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితుడు సల్మాన్‌ఖాన్‌గా గుర్తించారు. వెంటనే చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. Also Read:


By December 23, 2019 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-fiance-husband-robbery-from-his-would-be-wifes-house/articleshow/72934047.cms

No comments