Breaking News

పెళ్లయిన రెండోరోజే వధువు మృతి.. కారణం తెలిస్తే షాకే


ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిందా యువతి. అయితే కాళ్ల పారాణి ఆరకముందే మృత్యువు తలుపుతట్టింది. దీంతో అప్పటివరకు బంధువులతో కళకళ్లాడిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: పలాస మండలం గరుడఖండి గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెందిన గోపీనాథ్‌‌తో నవంబర్ 28న నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా జరిగింది. అయితే శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో దమయంతికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. Also Read: పెళ్లయి ఏ ముచ్చటా తీరకుండానే దమయంతి చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మాలకు కట్టిన మామిడాకులు వాడకుండానే ఆ ఇంట్లో రోదనలు మిన్నంటడంతో అందరినీ కలిచివేస్తోంది. Also Read:


By December 01, 2019 at 01:46PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-dies-heart-attack-in-srikakulam/articleshow/72316851.cms

No comments