Breaking News

ఒంగోలులో పట్టపగలే దారుణం.. భర్తను కొట్టి వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు


ప్రకాశం జిల్లా ఒంగోలులో వివాహిత కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన మామను పరామర్శించేందుకు వచ్చిన మహిళను బుధవారం కొందరు దుండగులు కారులో బలవంతంగా తీసుకువెళ్లారు. నగరం నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పట్టపగలు జరిగిన తీవ్ర కలకలం రేపింది. ఆమెను ప్రియ Also Read: జరుగుమల్లి మండలం వర్ధినేనివారిపాలెం గ్రామానికి చెందిన మహేంద్ర, అదే మండలం అక్కచెరువుపాలేనికి ఓ యువతి గుంటూరులో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే అయినా ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో నెలరోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమవివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికీ ఆచూకీ తెలియకుండా జీవిస్తున్నారు. ఇటీవల మహేంద్ర తండ్రి ఓ ప్రమాదంలో గాయపడిన ఒంగోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. Also Read: దీంతో ఆయన్ని పరామర్శించేందుకు మహేంద్ర భార్యతో కలిసి బుధవారం అక్కడికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బస్సు దిగి హాస్పిటల్‌కి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మహేంద్రను తోసేసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వారిని అడ్డుకునే యత్నం చేసినా ఫలించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చి కారు నంబర్ చెప్పారు. యువతిని కిడ్నాప్ చేసిన కారు టంగుటూరు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారా? లేక వేరెవరైనానా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By December 05, 2019 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-woman-kidnapped-in-ongole-city/articleshow/72377095.cms

No comments