సమయం లైవ్ న్యూస్: వివేకా హత్యకేసులో సిట్ దూకుడు.. యడ్డీకి ప్రాణసంకటం

⍟ కర్ణాటకలో ఉప-ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం మొదలైంది. మొత్తం 15 స్థానాలకు ఉప-ఎన్నికలు జరుగుతుండగా, 37.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది రెబల్స్‌పై నాటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడంతో ఉప-ఎన్నికలు అనివార్యమయ్యాయి. ⍟ దిశ హత్యపై అర్చకుడి ఆవేదన ఈ దేశంలో అమ్మాయిలంటే అంత చులకనయ్యారా అని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనకు అమ్మాయిలను గౌరవించడం రాదా? అని ప్రశ్నించారు. కనీసం చర్చా కార్యక్రమాలు, సోషల్ మీడియా పోస్టుల్లోనైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండని కోరారు. యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ⍟ మహిళపై యాసిడ్ దాడి విశాఖపట్నంలో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళపై మరో మహిళ యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వివాహితపై గుర్తు తెలియని మహిళ యాసిడ్ పోసి పరారైంది. ⍟ వివేకా హత్య కేసులో సిట్ దూకుడు.. మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని ప్రశ్నిస్తోంది. మూడు రోజులుగా ఈ విచారణ చేపడుతోంది.. తాజాగా సిట్ మరికొందరికి కూడా నోటీసులు పంపించింది. సిట్ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
By December 05, 2019 at 08:42AM
No comments