Breaking News

గుంటూరు: బాలికపై టీచర్ అత్యాచారం.. భార్య సహకారంతో ఇంట్లోనే..


విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ కామాంధుడిలా మారాడు. కూతురు వయసున్న బాలికపై ఇంట్లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు.. అడ్డుకోవాల్సిన భార్య కూడా సహకరించింది. జిల్లా తాడేపల్లిలోని కొలనుకొండలో ఈ దారుణం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలోనే ఈ ఘోరం బయటపడింది. కొలనుకొండలో ఖాశీం అనే వ్యక్తి ఉర్దూలో హోమ్ ట్యూషన్ చెబుతున్నాడు. అతడి ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే బాలికపై కన్నేశాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టాడు. గత ఆరు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. ఈ విషయం బయటకు రావడంతో కొంతమంది పెద్దల సహకారంతో రాజీ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బాలికను హాస్టల్‌కు తరలించారు. హాస్టల్‌కు వెళ్లిన బాలికను ఆ కామాంధుడు వదల్లేదు. మళ్లీ బాలికను తీసుకొచ్చి మూడు రోజులుగా అత్యాచారం చేశాడు. తన ఇంట్లోనే బంధించి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. అతడి భార్య అడ్డుకోవాల్సిందిపోయి సహకరించింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


By December 28, 2019 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tuition-teacher-raped-minor-student-in-guntur-district/articleshow/73003435.cms

No comments