Breaking News

కులాంతర వివాహానికి నిరాకరణ.. ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ఆత్మహత్య


వారిద్దరు ప్రేమించుకున్నారు. కులాలు వేర్వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ప్రియురాలు దక్కదనే మనస్తాపంతో ఆమె ఇంటి ముందే ప్రియుడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పీలమేడు రంగమ్మాళ్‌ ఆలయ వీధికి చెందిన సుజిత్‌ (20) నిలంపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సింగానల్లూర్‌ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి, సుజిత్‌ ప్రేమించుకున్నారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న సుజిత్‌ తండ్రి కులాంతర వివాహం కుదరదని తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సుజిత్‌ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. అలాగే, ప్రియురాలి కుటుంబీకులు కూడా వివాహానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రియురాలి ఇంటివద్దకు వెళ్లిన సుజిత్‌ వెంట తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన సుజిత్‌ను చుట్టుపక్కల వారు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 21, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-commits-suicide-in-front-of-girlfriend-home/articleshow/72912340.cms

No comments