Breaking News

మద్యం మత్తులో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..


కేంద్రపాలిత ప్రాంతం సమీపంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం పనులు నిమిత్తం బయటకు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉండే బొమ్మిడి నూకరాజు మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. Also Read: ఈ కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక తల్లికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె వెంటనే యానాం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నూకరాజును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం యానాం ప్రభుత్వాసుత్రికి తరలించారు. ఈ ఘటన యానాంలో తీవ్ర కలకలం రేపింది. Also Read:


By December 06, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-for-rape-attempt-on-5-yr-old-girl/articleshow/72393612.cms

No comments