Breaking News

సమయం లైవ్ న్యూస్: మృగాళ్ల రాక్షసకాండకు ఆరిపోయిన మరో దీపం


మృగాళ్లకి చిక్కి ఆరిపోయిన మరో దీపం: దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మృగాళ్ల దమకాండకు బలైన మరో దీపం మాత్రం శుక్రవారం ఆరిపోయింది. గతేడాది డిసెంబరులో అత్యాచారానికి గురైన ఉన్నావ్ యువతిపై నిందితులు రెండు రోజుల కిందట కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. పూర్తి కథనం.. ఎన్‌కౌంటర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందని.. నిందితులకు సరైన శిక్ష పడిందంటున్నారు. ఈ ఘటనపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఈ ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌ను ఆయన తప్పుబట్టారు. పూర్తి కథనం.. వైసీపీలోకి టీడీపీ కీలక నేత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్దికాలంగా అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. పూర్తి కథనం..


By December 07, 2019 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-7th-december-2019/articleshow/72410229.cms

No comments