Breaking News

ఆ పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా జైలుకే: డీజీపీ వార్నింగ్


ఇంటర్నెట్ వినియోగంతో నట్టింట్లోకి వచ్చేసిన పోర్నోగ్రఫీ కట్టడిపై చెన్నై పోలీసులు కఠినచర్యలు తీసుకోనున్నారు. అనేక పోర్న్ వెబ్‌సైట్లను గతంలో కేంద్రం బ్యాన్ చేసినా కొత్త పేర్లతో ఆ సైట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో వాటిని నివారించడంతో పోలీసులకు సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా చెన్నైలో చూస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా మహిళలపై దాడులు పెరిగే అవకావముందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోర్న్ వీడియోలు చూసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Also Read: చిన్నారుల పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా, వాటిని ఇతరులకు షేర్ చేసినా వారికి అరెస్ట్ తప్పదని అడిషనల్ డీజీపీ రవి బుధవారం హెచ్చరించారు. పోర్న్ వీడియోలు చూసేవారిలో చెన్నై మొదటి స్థానంలో ఉన్నట్లు ఓ సర్వేలో తేలిందని చెప్పారు. చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫొటోలు చూసే, డౌన్‌లోడ్‌ చేసే వ్యక్తుల సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌‌లను కేంద్ర ప్రభుత్వం తమకు పంపిందని, వాటి ఆధారంగా ఆ యా వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. చైల్డ్ పోర్న్ వీడియోలు చూసేవారికి 3-7ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని డీజీపీ తెలిపారు. Also Read: Also Read:


By December 05, 2019 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/browsing-child-porn-will-land-you-in-jail-tn-agdp-warning/articleshow/72377360.cms

No comments