Breaking News

సూర్యాపేటలో కీచకుడు.. మైనర్ బాలికపై మారుతండ్రి అత్యాచారం


సూర్యాపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వావి వరుసలు మరిచిన ఓ మానవ మృగం కూతురి వరుసయ్యే 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేటకు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. Also Read: ఆ మహిళ కుమార్తె(16) చదువు మానేసి ఇంటి వద్దే ఉంటూ అప్పుడప్పుతూ తల్లితో కలిసి కూలిపనులకు వెళ్తుంటుంది. అయితే బాలికపై కన్నేసిన మారుతండ్రి(తల్లి రెండో భర్త).. తరుచూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఒప్పుకోకుండా అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల ఒకటో తేదీన తల్లి కూలిపనులకు వెళ్లిన సమయంలో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా ఏడవడంతో ఇకపై ఇలాంటి పని చేయనని, తల్లికి చెప్పొద్దని ఆ కామాంధుడు వేడుకున్నాడు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. Also Read: బుధవారం ఉదయం తల్లి లేని సమయంలో మరోసారి బాలికపై ఆ నీచుడు చేయబోయాడు. దీంతో బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి ఆ కామాంధుడిని అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By December 05, 2019 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-by-step-father-in-suryapet-accused-arrested/articleshow/72377616.cms

No comments