ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య.. అల్లుడే చంపేశాడంటున్న అత్తమామలు

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను చేతులారా చంపేసి తానుకూడా ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకా హాగలహళ్లి గ్రామానికి చెందిన సుందరేశ్ పక్క గ్రామానికి చెందిన సునీతతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ అమ్మాయి తేజస్వి, కుమారుడు తరుణ్‌సంతానం. ఇటీవల దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంటికొచ్చిన సుందరేశ్ భార్యతో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో సునీతపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన సునీత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం తాను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన సుందరేశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. Also Read: దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. దీనిపై సునీత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుందరేశ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందువల్లే తమ కూతురిని నిత్యం వేధించేవాడని సునీత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు, ఆమె పిల్లల చావుకు కారణమైన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By December 22, 2019 at 11:25AM
No comments