తాళి వదిలేసి.. 70 సవర్ల బంగారంతో నవ వధువు జంప్.. ప్రియుడి తండ్రి ఆత్మహత్య

పెళ్లై పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే ఓ తన ప్రియుడితో కలిసి ఉడాయించింది. పెళ్లయిన యువతిని తన కుమారుడు తీసుకొని పారిపోవడంతో అవమానంగా భావించిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. జిల్లా ఇరుదాం కాట్టుకు చెందిన వేల్ మురుగన్ (29) కలెక్టరేట్‌లో పనిచేస్తున్నాడు. పరచూరుకు చెందిన రాజేశ్వరితో ఇటీవలే మురగన్‌కు వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజుల పాటు ఈ దంపతులు ఆనందంగానే ఉన్నారు. Also Read: ఈ నేపథ్యంలో గత వారం రాజేశ్వరి కనిపించకుండా పోయింది. 11 సవర్ల తాళి మాత్రం ఇంట్లో వదిలేసి.. 70 సవర్ల బంగారం, రూ. 10 వేలు నగదు తీసుకుని పరారైంది. ఆమె కోసం ఎక్కడ గాలించినా ఫలితం లేక పోవడంతో విళి సందై పోలీసులకు భర్త మురుగన్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో రాజేశ్వరి కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆమె ఇంటి పక్కనే ఉన్న సంతోష్ జాడ కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సంతోష్ కోసం గాలించినా సమాచారం లభించలేదు. చివరకు బెంగళూరులో ఉన్న సంతోష్ స్నేహితుడు గోపిని విచారించగా.. వారిద్దరి గుట్టు వెలుగులోకి వచ్చింది. తన ఇంటి పక్కనే ఉన్న నిరుద్యోగి అయిన సంతోష్‌ను గత కొన్నేళ్లుగా రాజేశ్వరి ప్రేమిస్తోంది. అయితే అతడికి ఉద్యోగం లేకపోవడంతో చివరకు తండ్రి చెప్పినట్టుగా మురుగన్‌ను వివాహం చేసుకుంది. అయితే సంతోష్‌ను మరచిపోలేకపోయిన రాజేశ్వరి అతడితో కలిసి పారిపోయింది. వీరిద్దరూ బెంగళూరులో ఉన్నట్టుగా గోపి సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాలిస్తున్నారు. Also Read: ప్రియుడి తండ్రి ఆత్మహత్యపెళ్లయిన రాజేశ్వరి, సంతోష్ పారిపోయిన విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో తన కుమారుడు వివాహితతో పారి పోవడాన్ని అవమానంగా భావించిన సంతోష్ తండ్రి జగదీశన్ ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించాడు. తన కుమారుడి చర్యతో జగదీశన్ బలన్మరణానికి పాల్పడటం ఆ గ్రామంలో విషాదానికి దారి తీసింది. కాగా, తన కుమార్తెను సంతోష్ కిడ్నాప్ చేసినట్లుగా రాజేశ్వరి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. Also Read:
By December 24, 2019 at 09:23AM
No comments