Breaking News

బేగంపేటలోని పబ్‌పై పోలీసుల దాడులు.. డ్యాన్సర్లతో చిందులు, వ్యభిచారం.. 32 మంది అరెస్ట్


బేగంపేటలో నిర్వహస్తున్న లిస్బన్ పబ్‌ నిర్వాహకులు మరోసారి రెచ్చిపోయారు. నిర్ణీత సమయ దాటినా పబ్‌లో గానాబజానా చేస్తూ ఉల్లంఘనలు అతిక్రమించారు. దీనికి తోడు పబ్‌కు ఒంటరిగా వచ్చే యువకులకు వారే అమ్మాయిలను సరఫరా చేస్తూ, భారీగా డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది యువతులకు పబ్‌లోకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చి అబ్బాయిలతో డ్యాన్స్ చేయాలన్న కండిషన్ పెడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. Also Read: దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, పంజగుట్ట పోలీసులు కలిసి బుధవారం అర్ధరాత్రి పబ్‌పై దాడులు చేశారు. ఈ సందర్భంగా 21 మంది యువతులు, 9 మంది యువకులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరి దగ్గర్నుంచి రూ.1.47 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. Also Read: లిస్బన్ పబ్‌లో ఇటీవల అర్థరాత్రి దాటినా కార్యకలాపాలు నిర్వహించడంతో స్థానికుల నుంచి పోలీసులకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డ్యాన్సర్లు అర్ధనగ్నంగా, అసభ్యంగా డ్యాన్సులు చేయడంతో పాలు, ఒంటరిగా వచ్చే అబ్బాయిలకు నిర్వాహకులే అమ్మాయిలను సరఫనా చేస్తున్నారని చాలామంది ఫిర్యాదు చేశారు. పబ్‌లో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు అందమైన అమ్మాయిలతో మందుబాబులకు వలేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. Also Read: పబ్‌లో డ్యాన్సర్లు లేరని నిర్వాహకులు పైకి చెబుతున్నా లోపల తంతు మాత్రం వేరుగా కనిపిస్తోంది. పబ్‌కొచ్చే వారి కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి గంటకు రూ.వెయ్యి చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌కు తరుచూ వచ్చే యువతులకు డబ్బు ఆశచూపి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం కోసం పబ్‌లోనే కొన్ని గదులు కేటాయించినట్లు సమాచారం. Also Read: పబ్‌లో అర్ధనగ్న దుస్తులతో డ్యాన్సర్లు చేస్తున్న రచ్చతో కొందరు కస్టమర్లు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా యూత్‌ని టార్గెట్ చేసుకునే నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. లిస్బన్ పబ్‌పై ఇలాంటి ఆరోపణలు, వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఈ పబ్ ఎదుటే కొందరు ఓ డ్యాన్సర్‌ను వివస్త్రను చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. Also Read:


By December 19, 2019 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-raid-lisbon-pub-at-begumpet-arrests-21/articleshow/72880384.cms

No comments