Breaking News

స్పా ముసుగులో వ్యభిచారం.. 29 మంది వేశ్యలు, 30 మంది కస్టమర్ల అరెస్ట్


పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలో అనేకచోట్ల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు. రెండు బ్యూటీపార్లర్లతో పాటు మరో రెండు చోట్ల నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్లపై ఏకకాలంలో దాడులు చేసి 29 మంది సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలించారు. వ్యభిచార నిర్వాహకులు, విటులులతో కలిపి మరో 30 మందిని అరెస్ట్ చేశారు. Also Read: జాదవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రిన్స్ అన్వర్ షా రోడ్‌లోని ఓ భవనంలో మూడో అంతస్తులో నిర్వహిస్తున్న వేశ్యాగృహంపై సోమవారం పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్స్‌రాకెట్ నిర్వాహకుడితో పాటు 8 మంది వ్యభిచారిణులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో భవానీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగవాన్ మహావీర్ శరణి ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా సెంటర్‌లో దాడి చేసి 10 మంది సెక్స్‌వర్కర్లు, తొమ్మిది మంది కస్టమర్లతో పాటు మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. Also Read: మూడవ దాడిలో, ఇద్దరు కస్టమర్లు, వేశ్యాగృహం యజమాని మరియు నిర్వాహకుడిని గారియాహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్బహారీ అవెన్యూ ప్రాంగణంలోని మొదటి అంతస్తు నుండి అరెస్టు చేశారు. ఆరుగురు సెక్స్ వర్కర్లను తొలగించారు. సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మీర్జా గాలిబ్ వీధిలో గల గైస్ అండ్ డాల్స్ బ్యూటీపార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ పార్లర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడితో పాటు ఆరుగురు సెక్స్‌వర్కర్లు, ముగ్గురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. Also Read: కోల్‌కతాలోని సౌత్, సెంట్రల్‌ జోన్లలోని అనేక చోట్ల ఈ దాడులు నిర్వహించినట్లు జాయింట్ కమిషనర్ (క్రైమ్) మురళీధర్ శర్మ తెలిపారు. సెక్స్‌వర్కర్లను బాధితులుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని, కస్టమర్లు, వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించామన్నారు. నిందితులపై ఆయా పోలీస్‌స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 11, 2019 at 12:15PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-rackets-busted-in-kolkata-29-sex-workers-rescued-30-customers-including-brothel-managers-held/articleshow/72468892.cms

No comments