Breaking News

ఐసీయూలో 206 మంది మహిళా రోగులను రేప్ చేసి.. వీడియోలు తీసి..!


ఆస్పత్రిలోని అత్యవస విభాగంలో నర్సుగా పని చేసిన ఓ వ్యక్తి 24 మంది బాలికలు సహా 206 మంది మహిళా రోగులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చేసుకుంది. మైఖేల్ డేవిడ్ బ్రాగ్గ్(39) అనే వ్యక్తి యూపీఎంసీ కార్లిస్లే ఆస్పత్రి అత్యవసర విభాగంలో 2016 జనవరి నుంచి 2019 ఏప్రిల్ 19 వరకు నర్స్‌గా పనిచేశాడు. ఈ సమయంలో ఐసీయూలోని మహిళా రోగులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. Also Read: తీవ్రమైన అనారోగ్యంతో అత్యవసర వైద్య సహాయం కోసం ఈ విభాగంలో చేరిన రోగుల నిస్సహాయతను ఆసరగా చేసుకొని బ్రాగ్గ్ దారుణాలకు ఒడిగట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడి ల్యాప్‌టాప్‌లో చిన్న పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు బయట పడటంతో పోలీసులు బ్రాగ్గ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపారు. ఇందులో భాగంగా అతడి ల్యాప్‌టాప్‌లోని వీడియోలను చూసిన పోలీసులు షాకయ్యారు. ఆసుపత్రిలోని ఐసీయూలో ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను నగ్నంగా చేసి అత్యాచారానికి పాల్పడుతూ ఆ నీచుడు వీడియో తీసుకున్నాడు. Also Read: అలాగే అత్యవసర విభాగంలో మరో మహిళపై లైంగిక హింసకు పాల్పడ్డాడు. 24 మంది బాలికలు సహా దాదాపు 206 మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఇలా మహిళా రోగులకు సంబంధించిన అశ్లీల వీడియోలు ల్యాప్‌ట్యాబ్‌లో భద్రపరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. గురువారం బ్రాగ్గ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ విషయాలను బహిర్గతపరిచారు. Also Read:


By December 21, 2019 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/american-male-nurse-sexually-assaulted-patients-and-secretly-recorded/articleshow/72912985.cms

No comments