Breaking News

ప్రియురాలి కుమార్తెపై అత్యాచారం... మృగాడికి 20 ఏళ్ల జైలుశిక్ష


కుమార్తె వరసయ్యే బాలిక(15)పై చేసిన కేసులో మృగాడికి న్యాయస్థానం 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సైకం కృష్ణారావు (54) ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తుండేవాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: తనను పెళ్లి చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని పోషిస్తేనే సంబంధాన్ని కొనసాగిస్తానని ఆ మహిళ చెప్పడంతో కృష్ణారావు సరేనంటూ ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. అయితే వరుసకు కూతురైన ఆ మహిళ పెద్ద కుమార్తె(15)పై కృష్ణారావు కన్నేశాడు. 2018 జనవరి 27న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె నిందితుడిని నిలదీసింది. దీంతో అతడు తల్లీకూతుళ్లను బెదిరించి పరారయ్యాడు. బాలిక తల్లి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. దీనిపై వాదోపవాదనలు ముగిసిన తర్వాత దోషికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు జడ్జి జి.ప్రతిభాదేవి సోమవారం తీర్పు చెప్పారు. Also Read:


By December 03, 2019 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-man-gets-20-years-in-jail-for-raping-minor-daughter/articleshow/72343157.cms

No comments