Breaking News

‘అమ్మా నాన్న క్షమించండి.. ప్రేమలో మోసపోయి చనిపోతున్నా’.. 10 పేజీల లేఖ రాసిన యువతి


పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిప్పుకుని లైంగికంగా అనుభవించిన ప్రియుడు మోజు తీరాక మొహం చాటేయడంతో బాధితురాలు తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరొక యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా కుప్పంలో జరిగిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: మండలం కంగుంది పంచాయతీ కౌసిగానిపల్లె గ్రామానికి చెందిన యువతి(17) పదో తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన, సమీప బంధువైన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పడంతో నమ్మింది. దీంతో వీలైనప్పుడల్లా ఆమెను బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదాని ఆమె కూడా అడ్డు చెప్పకుండా హద్దులు దాటేసింది. అయితే కొద్దిరోజులుగా ఆ యువకుడు తప్పించుకుని తిరగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. Also Read: తాజాగా తన ప్రియుడికి వేరొక యువతితో పెళ్లి కుదిరిందని తెలుసుకుని షాకైంది. సోమవారం అతడికి నిశ్చితార్థం జరుగుతుండటంతో మనస్తాపానికి గురై 10 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు రాసిన లేఖలో ‘ అమ్మా నాన్న క్షమించండి. ప్రేమలో మోసపోయి చనిపోతున్నా. మీకు కడుపుకోతను మిగుల్చుతున్నందుకు క్షమించండి’ అంటూ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By December 03, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kuppam-young-woman-commits-suicide-over-love-failure/articleshow/72342094.cms

No comments