Breaking News

‘RX 100’ దర్శకుడికి చుక్కలు చూపిస్తున్నారు


RX 100 హిట్ తర్వాత హీరో, హీరోయిన్ లిద్దరూ తమతమ సినిమాలతో బిజీ అయ్యారు కానీ, దర్శకుడు అజయ్ భూపతికే ఇంకా రెండో సినిమా పట్టాలెక్కలేదు. వరసబెట్టి హీరోల చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. ఏ ఒక్క హీరో అవకాశం ఇవ్వడానికి రెడీగా లేరు. ‘మహాసముద్రం’ అంటూ ఓ కథ వేసుకుని అజయ్ భూపతి స్టార్, మీడియం అండ్ యంగ్ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని జరగడం లేదు. నితిన్, రవితేజ, నాగచైతన్య చివరికి కార్తికేయ కూడా అజయ్ భూపతికి హ్యాండ్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. రవితేజ అయితే ‘మహాసముద్రం’ స్క్రిప్ట్ ఓకే చేసి చివరికి కాదన్నాడని... చీప్ స్టార్ అంటూ పెద్ద మాటలు మాట్లాడిన అజయ్ భూపతిని... నాగ చైతన్య కూడా ఊరించి మోసం చేసాడు. చైతు, అజయ్ ని కాదని మరో సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడట.

ఇక కార్తికేయతోనే ‘మహాసముద్రం’ తీసి టాలెంట్ ఏంటో అందరికి చూపించాలని అనుకుని కార్తికేయని లైన్‌లో పెట్టడము.. ఆ సినిమా కోసం విశ్వక్ సేన్‌ని విలన్ గా సెట్ చేసుకోవడం జరిగాయని టాక్. అయితే కార్తికేయకి గుణ 369 లాంటి ప్లాప్ షాకివ్వడంతో... మహాసముద్రం స్క్రిప్ట్‌పై నమ్మకం పోవడం, చాలామంది హీరోలు కాదన్న కథని చేస్తే... చివరికి తేడా కొడితే పరిస్థితి ఏమిటి అనుకున్నాడేమో... మహాసముద్రం పక్కనబెట్టి మరో కొత్త కథతో సినిమా చేద్దామని అజయ్ దగ్గర మెలిక పెట్టడంతో.. అజయ్ భూపతి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడట. మరి హీరోలంతా అజయ్ భూపతికి హోల్సేల్‌గా చుక్కలు చూపెడుతున్నారన్నమాట.



By December 01, 2019 at 02:41AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48505/rx-100-director.html

No comments