Breaking News

Pawan Kalyan ఎఫెక్ట్.. జార్జ్‌ రెడ్డికి షాక్‌ ఇచ్చిన పోలీసులు


ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసిన జార్జ్‌ రెడ్డి కథలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఈ రోజు(17-11-2019) హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యేందుకు అంగీకరించారు. అయితే ఈ వేడుకకు హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో అనుమతి నిరాకరించారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు, విద్యార్థి సంఘాలు భారీగా హాజరయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న కారణంగా ఈ వేడుకకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చిత్రయూనిట్ వేడుక ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో పునరాలోచనలో పడ్డారు. Also Read: 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో వంగవీటి ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) నటిస్తున్నాడు. దళం మూవీ ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 22న విడుదల కానుంది. Also Read:


By November 17, 2019 at 07:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/police-permission-denied-for-george-reddy-biopic-pre-release-event/articleshow/72091444.cms

No comments