Breaking News

Nirmal: గర్భంతో ఉండి ఇద్దరు ప్రియులతో కలసి రెండో భర్త దారుణహత్య


ఇద్దరు వ్యక్తులతో పెట్టుకున్న మహిళ తన సుఖానికి అడ్డొస్తున్నాడని ప్రియుల సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా చంపేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. వివాహ బంధానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన 4 నెలల క్రితం జరగ్గా... మామడ పోలీసులు తాజాగా చేధించారు. Also Read: నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్‌ (39) మొదటి భార్య చనిపోవడంతో ఆలూరుకు చెందిన పావని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. పావనికి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరు కలిసి అంకాపూర్‌లో కాపురం పెట్టారు. ఉదయ్ కూలిపనులకు వెళ్తుండగా, పావని బీడీలు చుట్టేది. రెండో పెళ్లి చేసుకున్న పావతి తనకు గతంలో పరిచయమున్న రమేశ్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు భర్త ఉదయ్ స్నేహితుడు గంగాధర్‌తోనూ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ఇద్దరు ప్రియులతో ఎంజాయ్ చేసేది. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. Also Read: దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న ఉదయ్‌ని ఎలాగైనా చంపేయాలని పావని తన ఇద్దరు ప్రియులకు పురమాయించింది. పథకం ప్రకారం వారిద్దరు జూన్ 5న అతడిని బైక్‌పై నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గ్రామ శివారుకు తీసుకొచ్చారు. దౌలాజీ, గంగాధర్‌ తక్కువ మద్యం తాగి... ఉదయ్‌కి ఎక్కువ తాగించారు. మద్యం మత్తులో ఉన్న అతడిని గోదావరిలో ముంచి ఉపిరాడకుండా చేసి చంపేశారు. జూన్ 9న ఉదయ్ మృతదేహం నీటితో తేలియాడటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత గుర్తుతెలియని మృతదేహంగా భావించిన పోలీసలు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: ఆ తర్వాత గంగాధర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లిపోగా.. రమేశ్, పావని విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. ఉదయ్ నాలుగు నెలలుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అతడి బంధువులు అక్టోబర్ 19న పావని ఇంటికి వెళ్లగా ఆమె ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ దొరికిపోయింది. ఉదయ్ ఏమయ్యాడని ఆమెను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిన పోలీసులు జూన్ 9న లభించిన మృతదేహం ఉదయ్‌గా నిర్ధారించారు. పావని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు. పావని ప్రస్తుతం 8నెలల గర్భిణి కావడం ఈ కేసులో మరో ట్విస్ట్. గర్భంతో ఉండి కూడా భర్తను ప్రియులతో కలిసి చంపేసిన పావని ఉదంతం తెలుసుకుని స్థానికులు షాకవుతున్నారు. Also Read:


By November 02, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-killed-her-husband-with-help-of-two-boyfriends-in-nirmal/articleshow/71861675.cms

No comments