Breaking News

నయనతార.. Lady Superstar ఎలా అయ్యారో తెలుసా?


డయానా మరియం కురియన్.. కలువ కళ్ల సుందరి, లేడీ సూపర్‌స్టార్ అసలు పేరు ఇదే. ఈరోజు నయన్ 35వ బర్త్‌డే జరుపుకొంటున్నారు. గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ సూపర్‌స్టార్‌గా నయన్ ఎలా పేరు తెచ్చుకున్నారో తెలియాలంటే.. ఆమె నటించిన ఈ ఐదు సినిమాలపై ఓ లుక్కేయాల్సిందే. ఎందుకంటే ఈ ఐదు సినిమాలే నయన్‌కు ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను తెచ్చిపెట్టాయి. ఆరం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం నయన్‌కు అలవాటైపోయింది. ఈసారి ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలని ఆరం అనే సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమా తెలుగులో కర్తవ్యం టైటిల్‌తో రిలీజ్ అయింది. ఇందులో నయన్ స్ట్రాంగ్, బోల్డ్ కలెక్టర్ పాత్రలో నటించారు. ఓ బాలిక సంపులో పడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ బాలికను కాపాడటానికి ఓ కలెక్టర్‌గా నయన్ చేసిన ప్రయత్నం ఏంటి అనేదే ఈ సినిమా. ఓ కలెక్టర్‌కు ఉండాల్సిన దర్పం, ఠీవి నయన్‌లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. అందుకే ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మాయా అశ్విన్ శరవణన్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇది. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తమిళ చిత్ర పరిశ్రమలో రొటీన్ కథలు ఎక్కువైపోవడంతో హార్రర్ కామెడీ సినిమాలకు బాగా లోటుండేది. ఎన్నో హార్రర్ కామెడీ కథలు నయన్ వద్దకు వచ్చాయి కానీ ఆమె అశ్విన్ రాసిన ఈ కథను సంతకం చేశారు. ఓ రకంగా నయన్ ఈ సినిమాతో రిస్క్ చేశారనే చెప్పాలి. కానీ రిస్క్ లేకపోతే లైఫ్‌లో సక్సెస్‌, కిక్ ఎలా వస్తాయి. అందుకే ఈ సినిమాతో నయన్ మంచి హిట్ అందుకున్నారు. మరో విషయం ఏంటంటే.. నయన్ నటించిన ఫస్ట్ సోలో హీరోయిన్ సినిమా ఇది. అలా మొదటి ప్రయత్నంలోనే నయన్ తనని తాను నిరూపించుకున్నారు. డోరా మాయా సినిమాతో సోలోగా సినిమాను రెండున్నర గంటలు నడిపించగలను అని నిరూపించిన నయన్.. తన తర్వాతి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం కొత్త డైరెక్టర్‌కు కల్పించారు. అలా డోరా సినిమా తెరకెక్కించింది. ఓ కారు, కుక్క నేపథ్యంలో సాగే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ నయన్ నటనకు మాత్రం 100 మార్కులు పడ్డాయి. కోళమావు కోకిల సోలోగా సినిమాను నడిపించేస్తూ.. బాక్సాఫీస్ వద్ద హిట్లు కొడుతున్న నయనతారపై డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కు వంద శాతం నమ్మకం ఏర్పడింది. అందుకే ఆమె సినిమాలో హీరో లేకపోయినా ఫర్వాలేదు అనుకుని కమెడియన్ల కూడా పెట్టి సినిమాలు తీసేవారు. అలా వచ్చిన సినిమాను ‘కోళమావు కోకిల’. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అమాయక అమ్మాయిగా కనిపించిన నయన్ తన తల్లి చికిత్స కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. చావుకు భయపడుతూ ఉండే అమ్మాయి.. తన ఆత్మ సంరక్షణ కోసం డబుల్ గేమ్ ఆడి హత్యలకు పాల్పడుతూ ఉంటుంది. అలా రెండు క్యారెక్టర్స్‌లోనూ నయన్ ఒదిగిపోయింది. సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఉండాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని ఈ సినిమాతో నయనతార మరోసారి నిరూపించింది. అంజలి సీబీఐ లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నయన్‌ను లేడీ సూపర్‌స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని నిరూపించిన సినిమా ‘అంజలి సీబీఐ’. ఇందులో నయన్ సీఐడీ అధికారి పాత్రలో నటించారు. అంజలిలోని విలనిజాన్ని కూడా బయటకు తీసిన సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా, అథర్వాలు కూడా ఉన్నారు. కానీ నయన్ ఉండటం వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన ఈ సినిమా ‘కోళమావు కోకిల’ తర్వాత రెండో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఈ ఐదు సినిమాలు నయన్ జీవితంలో ల్యాండ్ మార్క్స్‌గా నిలిచిపోయాయి. ఇక వరుసగా మంచి కాన్సెప్ట్స్ దొరికితే సినిమాలు చేసుకుంటూ పోవడమే తప్ప ఇండస్ట్రీలో నయన్ నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. నయన్ ఎలాంటి ప్రమోషన్స్‌లో ప్రెస్‌మీట్స్‌లో పాల్గొనరు. చెప్పాలంటే ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆమె ఏంటో ఆమె సినిమాలే మాట్లాడతాయి. ఇక నయన్ పర్సనల్ లైఫ్‌ విషయానికొస్తే.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ దాదాపు ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. 2020లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ న్యూయార్క్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విఘ్నేష్ తన ప్రియురాలి బర్త్‌డేను అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. ఇలాగే నయన్ తన రికార్డులను తానే బీట్ చేస్తూ.. ప్రేక్షకులను మరింత అలరించాలని కోరుకుంటూ లేడీ సూపర్‌స్టార్‌కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.


By November 18, 2019 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lady-superstar-nayanthara-birthday-article-how-did-she-turned-out-to-be-a-lady-superstar/articleshow/72102917.cms

No comments