Breaking News

స్నేహితుల అరాచకం.. మత్తు మందిచ్చి వివాహితపై గ్యాంగ్ రేప్


భర్త విదేశాలకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. ఆమెను పరిచయం చేసుకుని మత్తుమందు కలిపిన చాక్లెట్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాధితురాలి నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దోచుకున్నారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లా సాలి గ్రామంలో జరిగింది. Also Read: సాలి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త ఈ ఏడాది జులైలో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న అదే గ్రామానికి చెందిన హరీశ్‌కుమార్ అనే వ్యక్తి మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ కావాల్సిన పనులు చేసి పెట్టేవాడు. దీంతో వారిద్దరూ స్నేహితుల్లా మెలిగారు. ఓ రోజు హరీశ్ తన ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో మత్తుమందు కలిపిన చాక్లెట్ ఇచ్చాడు. అది తిన్న మహిళ కాసేపటికి మత్తులోకి జారుకుంది. Also Read: దాన్ని అవకాశంగా తీసుకున్న హరీశ్‌ ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రేప్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌తో వీడియోలు, ఫోటోలు తీశాడు. కాసేపటికి మెలకువలోకి వచ్చిన బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యంపై హరీశ్‌ను నిలదీయగా.. ఫోటోలు, వీడియోలు చూపించి బెదిరించాడు. ఈ విషయాన్ని హరీశ్.. తన ఫ్రెండ్ రమేశ్‌కు చెప్పడంతో అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇలా కొద్దిరోజుల పాటు వారిద్దరూ ఆమెను లైంగికదోపిడీ చేశారు. ఫోటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి రూ.వేలల్లో డబ్బులు గుంజారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందన్న భయంతో బాధితురాలు వారిద్దరి మధ్య నలిగిపోయింది. Also Read: కొద్దిరోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఆమె భర్త .. భార్య మెడలో ఉండాల్సిన మూడు సవర్ల బంగారు గొలుసు కనిపించకపోవడంతో నిలదీశాడు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో గట్టిగా ప్రశ్నించాడు. దీంతో ఆమె అసలు విషయం చెప్పి బోరుమంది. దీంతో బాధితురాలి భర్త వడపళని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు హరీశ్‌, రమేశ్‌పై అత్యాచారం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. Also Read:


By November 18, 2019 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-woman-gang-raped-by-friends-2-arrested/articleshow/72102979.cms

No comments