Breaking News

‘సీనయ్య’కు హీరోయిన్, విలన్ ఫిక్స్!?


మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా పేరుగాంచిన ద‌ర్శకుడు వివి వినాయ‌క్.. ‘సీనయ్య’గా ఫస్ట్ టైం హీరో అవ‌తారం ఎత్తుతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ సినిమా డైరెక్ట్ చేసే వినాయక్‌ను ఇప్పుడు మరో డైరెక్టర్.. హీరోగా చూపించబోతున్నాడన్న మాట. ‘సీన‌య్య’ అనే చిత్రాన్ని న‌ర‌సింహారావు తెరకెక్కిస్తుండగా.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే సీనయ్య సరసన రొమాన్స్ చేసేదెవరనే విషయం మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. అయితే అసలు హీరోయిన్ ఉంటుందా..? ఉండదా..? సీనయ్య సోలోగా చేసేస్తాడా..? సీనయ్యను ఢీ కొట్టేదెవరు..? అసలు సినిమాలో రొమాన్స్, ఫైట్స్ గట్రా ఉంటాయా..? ఉండవా..? అని ఈ సినిమాపై వినాయక్ వీరాభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయ్. 

తాజాగా.. సీనయ్యకు హీరోయిన్, విలన్ ఫిక్స్ అయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సీనయ్య సరసన రొమాన్స్ చేసేది మరెవరో కాదండోయ్.. తన అందచందాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన శ్రియ. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒకప్పుడు ఇదే హీరోయిన్‌ను తన సినిమాలకు తీసుకుని.. ఇప్పుడు అదే హీరోయిన్‌తో వినాయక్ రొమాన్స్ చేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’, నందమూరి బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’.. ఈ రెండు సినిమాలను వినాయకే తెరకెక్కించగా.. ఇందులో శ్రియ హీరోయిన్ నటించి మెప్పించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ.. లీకులు మాత్రం వస్తున్నాయ్.

ఇక సీనయ్యను ఢీ కొట్టేదెవరు..? అనే విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులను అలరించిన నవీన్‌ చంద్ర.. వినాయక్‌ను ఢీ కొనబోతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. హీరోగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా విలన్‌గా మారిపోయిన నవీన్‌ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్‌ పాత్రల్లో నటించి మెప్పించాడు. కాస్త యంగ్‌గా కనిపించే నటుడైతే సీనయ్య సరిగ్గా సెట్ అవుతాడని భావించిన డైరెక్టర్.. నవీన్‌ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ పుకార్లు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాల్సిందే మరి.



By November 28, 2019 at 01:20AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48454/shreya.html

No comments