Breaking News

అమరావతిలో కీచక పూజారి.. భక్తురాలిపై గుడిలోనే అఘాయిత్యం


నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ ఆయన్నే స్మరిస్తూ ఉండే అర్చకుడు కీచకుడి అవతారమెత్తాడు. దైవ సన్నిధిలోనే భక్తురాలిపై అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో ఈ ఘటన జరిగింది. Also Read: విజయవాడకు చెందిన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం స్వామివారి దర్శనార్థం గ్రామంలోని ఆలయానికి వచ్చారు. పెళ్లయి చాలారోజులైనా పిల్లలు కలగకపోవడంతో ఆ దంపతులు సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకుడికి దానాలు సమర్పించి పాదాలకు నమస్కరించారు. సంతానం కలగాలంటే మహిళతో ఆలయంలో ఒంటరిగా మాట్లాడాలని, అప్పుడే కోరిక నెరవేరుతుందని అర్చకుడు వారికి మాయమాటలు చెప్పడంతో సరేనన్నారు. దీంతో అతడు మహిళను దైవ సన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ అఘాయిత్యం చేయబోయాడు. Also Read: పూజారి చేష్టలకు భయపడిపోయిన మహిళ అతడిని ప్రతిఘటించిం కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు ఏం జరిగిందని అడగ్గా విషయం చెప్పింది. దీంతో వారు గుడిలోకి వచ్చేసరికే ఆ కామాంధుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితు కుటుంబం గ్రామస్థులకు చెప్పి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఈ ఉదంతంపై దేవాదాయ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై వారు అంతర్గత విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:


By November 27, 2019 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/priest-rape-attempt-on-married-woman-in-amaravati/articleshow/72252073.cms

No comments