పోలీసులకు చెడ్డీగ్యాంగ్ సవాల్.. హైదరాబాద్‌లో రెండు చోరీలు
హైదరాబాద్ శివారులో చెడ్డీగ్యాంగ్ మరోసారి హల్‌చల్ చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని కుంట్లూరు గ్రామంలో గురువారం రాత్రి రెండిళ్లలో చోరీకి పాల్పడ్డింది. ఈ ఘనలో రూ.70వేల నగదు, 15 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యారు. దీంతో కుంట్లూరు గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: అక్టోబర్ 25న కుంట్లూరులో ఓ వేదశాలతో పాటు పక్క గ్రామమైన పసుమాములలో చెడ్డీగ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడింది. హయత్‌నగర్‌లోనూ ఓ వ్యక్తిని బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డయినప్పటికీ పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. తాజాగా మరోసారి అదే కుంట్లూరును టార్గెట్ చేసి చెడ్డీగ్యాంగ్ రెండు చోరీలకు పాల్పడింది. Also Read: ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న సభ్యులు చోరీలు చేయగానే వివిధ మార్గాల్లో తప్పించుకుని వెళ్లిపోతున్నారు. తమ ఆచూకీ ఎక్కడా లభించకుండా వారు అనుసరించే మార్గాలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో వారిని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులకు సవాలుగా మారింది. Also Read:
By November 22, 2019 at 10:02AM
No comments