Breaking News

హైదరాబాద్‌నీ వదలని వర్మ.. మరో కాంట్రవర్సీకి తెరలేపిన ఆర్జీవీ


సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎక్కడుంటే అక్కడ వివాదాలు జరుగుతుంటాయి. తన సినిమాలకు తాను సృష్టించే వివాదాలతోనే కావాల్సినంత ప్రచారం తెచ్చిపెట్టుకునే వర్మ, తన శిష్యుల సినిమాల కోసం అప్పుడప్పుడు వివాదాలను సృష్టిస్తుంటాడు. అందుకే వర్మ ఏ సినిమాకైన మద్దతు తెలుపుతున్నాడంటే ఆ సినిమా విషయంలో కాంట్రవర్సీ కన్‌ఫర్మ్‌ అని ఫిక్స్‌ అవుతుంటారు ఆడియన్స్‌. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు తన మద్దతు తెలిపాడు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు ఊపిరి పోసిన స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి కథతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ శుక్రవారం (22-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లోకి వర్మ ఎంటర్‌ అయ్యాడు. సోమవారం ఈ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశాడు వర్మ. `జార్జ్‌ రెడ్డి మళ్లీ బతికి వచ్చినట్టుగా థ్రిల్‌ చేస్తోంది జార్జ్‌ రెడ్డి. సందీప్‌ మాధవ్‌ సూపర్బ్‌గా నటించాడు. దర్శకుడు జీవన్‌ రెడ్డితో పాటు సినిమాను రిలీజ్‌ చేస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలకు శుభాకాంక్షలు` అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అంతేకాదు సోమవారం రాత్రి మరో ఆసక్తికర ప్రకటన చేశాడు వర్మ. జార్జ్‌ రెడ్డి సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సందీప్‌ మాధవ్‌ను తన నెక్ట్స్‌ సినిమా కోసం తీసుకున్నట్టుగా ప్రకటించాడు. `విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల కథలను తెరకెక్కించిన తరువాత త్వరలో 80లలో హైదరాబాద్‌లోని దాదాల నేపథ్యంలో ఓ సినిమాను రూపొందిస్తున్నాను. శివ సినిమాకు నాకు ప్రేరణ ఇచ్చిన ఓ నిజజీవిత పాత్ర ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రలో నటించిన సందీప్‌ మాధవ్. ఇప్పుడు వర్మ సినిమాలో వర్మ అవకాశం రావటంపై సాండీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. జార్జ్‌ రెడ్డి సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. సినిమాలోని కంటెంట్‌ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో సినిమా రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.


By November 19, 2019 at 08:06AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-ram-gopal-varma-next-project-on-dadas-of-hyderabad/articleshow/72118540.cms

No comments