Breaking News

బీజేపీకి సూపర్ హిట్ సినిమాలో పాపులర్ డైలాగ్‌తో శివసేన పంచ్


మిత్రపక్షంలో ఉన్నప్పుడే బీజేపీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే శివసేన.. వైరిపక్షంగా మారిన తర్వాత మరింత దూకుడు పెంచింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా సీనియర్ నేత తరుచూ బీజేపీపై ఒంటికాలితో లేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఓ సూపర్ హిట్ సినిమాలో డైలాగ్‌తో బీజేపీకి రౌత్ పంచ్ వేశారు. మహారాష్ట్ర సీఎంగా శివసేన-ఎన్‌సీపీ- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో రౌత్ ట్వీట్ వైరల్ అవుతోంది. సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారంగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ఉరి. ఈ సినిమాలో 'హౌ ఈజ్ జోష్' అన్న డైలాగ్ పాపులర్ అయింది. ఇదే డైలాగ్‌ను వాడి బీజేపీకి సెటైర్ వేయడానికి సంజయ్ రౌత్ ప్రయత్నించారు. ‘హౌ ఈజ్ జోష్.. జై మహారాష్ట్ర’ అంటూ సంజయ్ ట్విట్ చేశారు. అజిత్ పవార్‌ను తమవైపు తిప్పుకుని ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత ఆ పార్టీపై శివసేన మరిన్ని విమర్శలు గుప్పిస్తోంది. మహారాష్ట్రలో బలం లేకపోయినా..అధికార దుర్వినియోగంతో బీజేపీ అధికారం చేపట్టిందని సంజయ్ రౌత్ రెండు రోజుల కిందట ఆరోపించారు. రాష్ట్రపతి..గవర్నర్ కార్యాలయాలను దుర్వినియోగం చేసిందని, రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శనివారం మహారాష్ట్రకు చీకటి రోజుగా అభివర్ణించారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అనే విషయం మహారాష్ట్ర ప్రజలకే తెలియదని ఆయన ఎద్దేవా చేసారు. బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోవటం కోసం కొనుగోలు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇంతగా అధికార దుర్వినియోగం గతంలో ఎన్నడూ చూడలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.


By November 28, 2019 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shiva-sena-senior-leader-sanjay-raut-satirical-punch-with-uri-movie-dialogue-to-bjp-viral/articleshow/72271782.cms

No comments