Breaking News

అమెజాన్‌లో వచ్చేసింది.. రీమేక్ డౌటే..?


మొన్నామధ్యన బెల్లంకొండ హీరో తమిళ రీమేక్‌గా ‘రాక్షసుడు’ సినిమా చేసాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు రాక్షసుడు హిట్టే.. కానీ కలెక్షన్స్ నిల్. కారణం తమిళంలో తెరకెక్కిన రాట్ససన్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా తెలుగు రీమేక్ కన్నా ముందే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రావడం, సినిమా టాక్‌పై ఆసక్తి కలిగిన తెలుగు ప్రేక్షకులు తమిళ వెర్షన్‌ని అమెజాన్ ప్రైమ్‌లో చూసెయ్యడంతో తెలుగు వెర్షన్ రాక్షసుడు సినిమాకి కలెక్షన్స్ రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన తప్పే ఇప్పుడు మరో సీనియర్ హీరో చెయ్యబోతున్నాడు.

ఆయనే వెంకటేష్. తమిళనాట విజయకేతనం ఎగురవేసిన ‘అసురన్’ సినిమాని రీమేక్ చెయ్యబోతున్నట్టుగా వెంకటేష్ అన్న సురేష్ బాబు అధికారికంగా ప్రకటించారు. అయితే రీమేక్ రైట్స్ కొనడమే కానీ.. ఇంకా ఆ సినిమాకి ఆలు లేదు చూలు లేదు. కారణం ఇంకా డైరెక్టర్ కానీ, హీరోయిన్ కానీ సెట్ కాకపోవడం, వెంకటేష్ ఇంకా అసురన్ రీమేక్ కోసం రెడీ అవకపోవడం వంటివి తెలిసిన విషయలే. మరి అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న వారు ఆగుతారా.. ఆగరు. అమెజాన్ ప్రైమ్ అసురన్ తమిళ వెర్షన్‌ని రిలీజ్ చేసేసింది. మరి అసురన్ హిట్ అవడంతో తెలుగు ప్రేక్షకులు తమిళ అసురన్ కోసం కాచుకుని కూర్చున్నారు. మరి తమిళ అసురన్ చూసేసిన జనాలకు.. మళ్ళీ రీమేక్ చేస్తే ఏం ఆనుతుంది. మరి వెంకటేష్ ఇప్పుడు అసురన్ రీమేక్ చేస్తాడా? లేదా? అనేది డౌట్ అంటున్నారు. 



By November 16, 2019 at 03:56AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48283/asuran.html

No comments