Breaking News

సీనియర్‌ హీరోయిన్‌పై ట్రోలింగ్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న నటి


సోషల్‌ మీడియా అభివృద్ది చెందిన తరువాత దాని ఎంత మంచి జరుగుతుందో అంతే స్థాయిలో చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా భారీ సెలబ్రిటీలు సోషల్ మీడియా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత జీవితాలు బయటకు రావటంతో పాటు సెలబ్రిటీ అభిప్రాయాలపై దారుణమైన ట్రోలింగ్‌లు జరుగుతున్నాయి. ముక్కుసూటిగా వ్యవహరించే ప్రముఖులకు ఈ ట్రోలింగ్‌ వల్ల మరింతగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయా నాయకురాలు ఖుష్బూకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కొంత కాలంగా ఖుష్బూను టార్గెట్ చేస్తూ కొంత మంది ఆకతాయిలు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. Also Read: దీంతో ఇక వేదింపులు బరించలేక తానే ట్విటర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది ఖుష్బూ. ఆమె నిర్ణయంతో అభిమానులతో పాటు రాజకీయా వర్గాలు కూడా షాక్‌ అయ్యాయి. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Also Read: రాజకీయ పరిణామాలనపై, నాయకులపై ముక్కుసూటిగా స్పందించటం ఖుష్బూకు అలవాటు. అయితే కొంత కాలంగా ఆమెచేస్తూన్న ట్వీట్లను వ్యతిరేకిస్తూ ఓ వర్గం నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల అవి మరింతగా శృతిమించాయి. దారుణమైన వ్యాఖ్యలు, బూతులు కూడా పోస్ట్ చేస్తుండటంతో ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఖుష్బూ సినిమాలకు మాత్రం దూరం కాలేదు. అడపాదడపా కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం తమిళ్‌లో పలు రియాలిటీ షోస్‌కు వ్యాఖ్యతగా వ్వవహరించటంతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. కొన్ని సీరియల్స్‌ను నిర్మిస్తున్నారు.


By November 16, 2019 at 08:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/trolls-make-actress-khushboo-sundar-throw-herself-out-of-twitter/articleshow/72080065.cms

No comments