Breaking News

నాలుగేళ్లు ప్రేమించి.. కట్నం తీసుకుని పెళ్లి టైమ్‌కి వరుడి ట్విస్ట్


నాలుగేళ్లు ప్రేమించిన యువతిని రెండు వైపులా ఒప్పించి పెళ్లి సిద్ధమయ్యాడు ఓ యువకుడు. కట్నం కూడా తీసుకున్నాడు. పెళ్లి తేదీ నిర్ణయించి పత్రికలు పంచే సమయానికి మరో యువతితో తనకు ముందే పెళ్లి అయిపోయిందంటూ కాబోయే భార్యకు ఫోటోలు పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం డబ్బులు ఎగ్గొట్టేందుకు యువకుడు ఈ విధంగా చేస్తున్నాడని యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. Also Read: యూసుఫ్‌గూడ లక్ష్మీనర్సింహనగర్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ అనే యువకుడు తన ఇంటి పక్కనే ఉండే యువతి తులసిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో ఈ నెల 22వ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తులసి తల్లిదండ్రులు దుర్గాప్రసాద్‌కు రూ.3.5లక్షల కట్నం ఇచ్చారు. గురువారం పెళ్లి జరగాల్సి ఉండగా.. రెండ్రోజుల క్రితం దుర్గాప్రసాద్ కాబోయే భార్యకు కొన్ని ఫోటోలు పంపాడు. తనకు గతంలోనే మరో యువతితో ఆర్యసమాజ్‌తో పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు పంపించాడు. Also Read: దీంతో షాకైన తులసి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తామిచ్చిన కట్నం డబ్బులైనా తిరిగివ్వాలని కోరగా.. ఇవ్వనని తెగేసి చెప్పాడు. దీంతో తులసి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దుర్గాప్రసాద్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 22, 2019 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/case-booked-on-hyderabad-groom-over-cheathing-woman/articleshow/72178319.cms

No comments