Breaking News

వెబ్‌ బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌.. త్వరలోనే డిజిటల్‌ ఎంట్రీ!


ప్రస్తుతం అంతా డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. బడా బడా నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు స్టార్స్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లోకి అడుగుపెట్టగా తాజాగా మరో టాప్‌ హీరోయిన్‌ ఈ రంగం దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన అందాల భామ తమన్నా భాటియా. తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ ఇటీవల వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ మరో కొత్త ప్రయోగానికి రెడీ అవుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓ వెబ్‌ సిరీస్‌లో ఈ భామ కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: `నవంబర్‌ స్టోరి` పేరుతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లో తమన్నా నటిస్తోంది. ఓ నేరుస్తుడైన తండ్రికి, అతని కూతురుతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జీఎం కుమార్‌ తండ్రి పాత్రలో నటిస్తుండగా తమన్నా కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తాను మరిన్ని విభిన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్టుగా వెల్లడించింది. రెగ్యులర్‌ రెండున్నర గంటల సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లలో నటనకు మరింత స్కోప్‌ ఉంటుదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. Also Read: `ఎపిసోడ్స్‌గా తెరకెక్కే వెబ్ సిరిస్‌లో నా స్కిల్స్‌ను మరింతగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వెబ్ సిరీస్‌లో నటించటం అంటే కంటిన్యూస్‌గా 5 సినిమాల్లో నటించటమే. ఒక కథను సుధీర్ఘంగా తెరకెక్కించే అవకాశం ఉంటే మరింత డిటెయిల్‌గా కథ చెప్పవచ్చు. ఆ వెసులు బాటు వెబ్‌ సిరీస్‌లలో ఉంటుంది` అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త దర్శకుడు రామ్‌ సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఆనంద వికటన్‌ గ్రూప్‌ నిర్మిస్తోంది. దీంతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న ఈ బ్యూటీ బోలే చుడియన్‌ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ రిలీజ్‌ కావాల్సి ఉంది.


By November 29, 2019 at 12:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/star-heroine-tamannaah-makes-her-web-series-debut/articleshow/72289599.cms

No comments