Breaking News

రైలు పట్టాలపై పడుకున్న కడప ప్రేమజంట.. పోలీసులను చూసి


రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న ప్రేమజంటను బ్లూకోల్ట్స్‌ పోలీసులు కాపాడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర (24) ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కొద్దిరోజుల తర్వాత యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీనికితోడు తమ కుమార్తెను నాగేంద్ర కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని కిడ్నాప్‌ కేసు పెట్టారు. Also Read: ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. పెద్దలను ఎదిరించి బతికడం కష్టమని భావించి చనిపోవాలను నిర్ణయించుకున్నారు. శనివారం ఎర్రముక్కపల్లె సమీపంలోని రైల్వేగేటు వంతెన వైపు వెళ్లి రైలు పట్టాలపై పడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూకోల్ట్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రమణమూర్తి, హోంగార్డు ప్రసాద్‌కు స్థానికులు విషయం చెప్పారు. దీంతో వారు రైలు పట్టాల మీదకు వెళ్లగా ఆ జంట పోలీసులను చూసి పారిపోయింది. Also Read: పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని వివరాలు కనుక్కోగా అసలు విషయం చెప్పారు. వారిని తమతో తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు యువతి వయస్సు 16ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. దీనిపై కడప వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 25, 2019 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lovers-try-to-commits-suicide-in-kadapa-district-police-gives-counselling/articleshow/72218005.cms

No comments