విషాదంగా ముగిసిన హనీమూన్.. మనాలీలో నవవరుడు దుర్మరణం
ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంట ఆనందం వారం రోజులు కూడా మిగల్లేదు. హనీమూన్ కోసం వెళ్లిన దంపతుల జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. భార్య కళ్లెదుటే భర్త ప్రమాదంలో కన్నుమూయడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషాద ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో చోటుచేసుకుంది. Also Read: రాజధాని చెన్నైలోని అమింజికరై తిరువీధి అమ్మన్ ఆలయం వీధికి చెందిన అరవింద్ (27)కు ప్రీతి అనే యువతితో గత వారం వివాహమైంది. కొత్తజంట కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. ఈ క్రమంలో వారు డోబీ అనే ప్రాంతాన్ని సందర్శించారు. అది పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి. అక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్న వారిని చూసిన అరవింద్ ఉత్సాహం కలిసిగింది. తానుకూడా పారాగ్లైడింగ్ చేస్తానని చెప్పడంతో ప్రీతి సరేనంది. దీంతో సోమవారం పైలట్ హరూరామ్‌తో కలిసి అరవింద్ గాల్లో విహరించాడు. Also Read: కాసేపు ఆకాశంలో విహరించిన అరవింద్ ప్రీతి చూస్తుండగానే ఒక్కసారిగా కిందపడిపోయాడు. నడుముకు కట్టుకున్న బెల్ట్ వీడిపోవడంతో నేరుగా కింద పడిపోయాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. అతడితో విహరించిన పైలట్ హరూరామ్ కూడా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని హరూరామ్‌ను ఆస్పత్రికి తరలించారు. అరవింద్ మృతదేహాన్ని కులు హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తన కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ప్రీతి కన్నీరుమున్నీరవుతోంది. అరవింద్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడంతో వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. Also Read:
By November 21, 2019 at 09:18AM
No comments