Breaking News

నర్సుతో బెడ్‌రూమ్‌లో రొమాన్స్.. ఇద్దరికీ నిప్పుపెట్టిన డాక్టర్ భార్య


ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న డాక్టర్ నీచానికి పాల్పడ్డాడు. తన ఆస్పత్రిలో పనిచేసే నర్సుతో పెట్టుకుని ఏకంగా తన ఇంట్లోనే రాసలీలలు మొదలుపెట్టాడు. భార్య లేని సమయంలో ప్రియురాలిని ఇంటికి రప్పించుకుని కామక్రీడల్లో మునిగి తేలేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో డాక్టర్‌ భార్య పక్కా ప్లాన్ వేసి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. Also Read: రాజస్థాన్‌లోని భరత్‌పూర్లో సుమిత్ అనే వ్యక్తి భార్య ఇంద్రాణితో కలిసి రాధేశ్యాం నగర్‌లో నివాసముంటున్నాడు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన సుమిత్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే ఓ నర్సుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమిత్ భార్య కళ్లుగప్పి ప్రియురాలితో షికార్లు చేసేవాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ఆమెతో తన బెడ్రూమ్‌లో రొమాన్స్ చేసేవాడు. ఈ విషయాన్ని పసిగట్టిన చుట్టుపక్కల వాళ్లు ఇంద్రాణికి చెప్పారు. దీంతో భర్త బాగోతాన్ని ఎలాగైనా బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. Also Read: శనివారం తాను బయటకు వెళ్తున్నానని, సాయంత్రం వరకు రానని ఇంద్రాణి భర్తకు చెప్పి వెళ్లిపోయింది. ఇదే సరైన సమయమని భావించిన సుమిత్ ఆస్పత్రికి వెళ్లకుండా ప్రియురాలిని ఇంటికి రప్పించుకున్నాడు. తనకు సాయంత్రం వరకు అడ్డులేకపోవడంతో నర్సులో రాసలీలలు మొదలుపెట్టాడు. మధ్యాహ్నం సమయంలో గుట్టచప్పుడు కాకుండా ఇంటికి వచ్చిన ఇంద్రాణి.. లోపల తన భర్త సాగిస్తున్న బాగోతాన్ని కిటికీలో నుంచి చూసింది. Also Read: పట్టరాని కోపంతో కిటిలో నుంచి లోపల కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు చెలరేగడంతో సుమిత్, తన ప్రియురాలితో కలిసి నగ్నంగా బయటకు పరుగులు తీశాడు. వెంటనే ఇంద్రాణి చుట్టపక్కల వాళ్లను పిలిచి తన భర్త అక్రమ సంబంధాన్ని గుట్టురట్టు చేసింది. దీంతో స్థానికులు వాళ్లిద్దరికి దేశశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని సుమిత్‌పై కేసు నమోదు చేశారు. Also Read:


By November 13, 2019 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-doctor-caught-red-handed-by-his-wife-oveer-sex-with-nurse-in-bed-room/articleshow/72033519.cms

No comments