Breaking News

కమెడియన్స్‌తో యంగ్ హీరో ప్రయోగం..!


విజయ్ దేవరకొండ ద్వారా ఇండస్ట్రీలోకి ఇద్దరు టాప్ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి సినిమాతో రాహుల్ రామకృష్ణ. ఈ ఇద్దరూ విజయ్ దేవరకొండ సినిమాల ద్వారానే కమెడియన్స్‌గా పరిచయమై ఇప్పుడు పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రియదర్శి అయితే హీరోగా కూడా మల్లేశం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక రాహుల్ రామకృష్ణ అయితే RRR లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ఇద్దరు కమెడియన్స్ తో ఓ యంగ్ హీరో సినిమా నిర్మించబోతున్నాడని టాక్.

మాములుగా ఈ మధ్యన యంగ్ హీరోలు.. తమకు నచ్చిన వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నట్లుగా.. వరస ప్లాప్స్‌తో సతమతమవుతున్న సందీప్ కిషన్ కూడా తానే హీరోగా నటించిన ‘నిను వీడని నీడని నేనే’ సినిమాని నిర్మించుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన నిర్మాణంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిని హీరోలుగా పెట్టి సినిమా చేయబోతున్నాడట. అయితే ఆ కథ కామెడీతో కూడుకున్నది కాదని, ఈ కమెడియన్స్ ఇద్దరు ఈ సినిమాలో యాక్షన్‌తో దుమ్ము రేపుతారట. 

మరి ఈ కథకు హీరోలు సెట్ అయ్యారు కానీ.. ఇంకా దర్శకుడు ఫైనల్ కాలేదు. సందీప్ కిషన్ నటించిన ‘తెనాలి రామకృష్ణ BABL’ సినిమా విడుదలయ్యాక సందీప్ ఈ సినిమా నిర్మాణం గురించి ప్రకటిస్తాడట. మరి ఇప్పటివరకు కామెడీ చేసిన రాహుల్, ప్రియదర్శి హీరోలుగా ఫైట్స్ ఎలా చేస్తారో చూడాలి.



By November 14, 2019 at 03:11AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48260/sundeep-kishan.html

No comments