Breaking News

ఫైటర్ తర్వాత దేవరకొండ బాబు సినిమాలివే!


‘వరల్డ్ ఫేమస్ లవర్’ ని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుకి దింపుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కొత్తగా కొన్న ఇంట్లో హాయిగా సేద తీరుతున్నాడు. 15 కోట్లకి కొత్త ఇల్లు కొనుగోలు చేసి తల్లితండ్రులతో తమ్ముడితో కొత్తింట్లోకి గృహ ప్రవేశం చేసిన విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ‘ఫైటర్’ కోసం బాడీ బిల్డప్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ మొదలైంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకి ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతుంది.అయితే ‘ఫైటర్’ తర్వాత విజయ్ దేవరకొండ ‘మజిలీ’ డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ మూవీకి కమిట్ ఆయనట్లుగా వార్తలొచ్చాయి. నిజంగానే విజయ్, శివ నిర్వాణతో సినిమా పక్కాగా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా శివ నిర్వాణం మూవీకి విజయ్ దేవరకొండ సైన్ చేసాడట.

ఇక తాజాగా మరో మూవీని కూడా విజయ్ లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. అది ‘అష్టాచెమ్మా, జెంటిల్‌మెన్ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలోని విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే కథతో ఇంద్రగంటి, విజయ్ ని ఇంప్రెస్స్ చేయడము, వీరిమధ్యలో మూవీ అగ్రిమెంట్ జరగడం అయ్యాయని.. ఇంద్రగంటి ‘వి’ సినిమా తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో ‘ఫైటర్’ తర్వాత విజయ్ దేవరకొండ, శివ నిర్వాణంతో ఫ్యామిలీ కథా చిత్రం, ఇంద్రగంటితో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కమిట్మెంట్ ఇచ్చేసాడని సమాచారం. 



By November 29, 2019 at 05:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48473/vijay-deverakonda.html

No comments