Breaking News

సుప్రీంకోర్టుకు చేరిన మహాపంచాయితీ.. నేడు అత్యవసర విచారణ


ఎన్నికల ఫలితాల తర్వాత రోజుకో మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాను తలపించిన రాజకీయాల్లో శనివారం నాటకీయ పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి మొదలుపెట్టి శనివారం తెల్లవారుజాముకే అన్ని లాంఛనాలు పూర్తిచేసి బీజేపీ అభ్యర్థి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కమలనాథులు వేసిన పాచిక పారడంతో ఎన్‌సీపీలో చీలిక ఏర్పడి అజిత్ పవార్ వారికి జైకొట్టారు. దీంతో మహారాష్ట్ర ప్రజలు నిద్రలేకముందే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అయితే, బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ చర్యలపై శివసేన, కాంగ్రెస్-ఎన్‌సీపీలు తీవ్రంగా మండిపడ్డాయి. Read Also: దీనిని సవాల్ చేస్తూ మూడు పార్టీలూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఫడ్నవీస్‌ను గవర్నర్‌ అహ్వానించడంపై మూడు పార్టీలూ అభ్యంతరం తెలిపాయి. తమ కూటమికి 144 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి. ఫడ్నవీస్‌‌ను 24 గంటల్లోగా బలం నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా.. ఇందుకు అంగీకరించింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. Read Also: మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్‌- ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్తున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్రవీస్‌, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. మహారాష్ట్ర ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా విమర్శించారు.


By November 24, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ncp-sena-congress-knocks-supreme-court-door-against-maharashtra-govt-to-hear-today/articleshow/72205587.cms

No comments