Breaking News

‘యాత్ర’ తర్వాత మరోసారి సీఎంగా మమ్ముట్టి


దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో కీలక ఘట్టం ఆయన పాతయాత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ దర్శకత్వం వహించగా.. వైఎస్ ఆర్ పాత్రను మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి పోషించారు. ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు అందుకుంది.. అంతే రీతిలో సూపర్ డూపర్ హిట్టయ్యింది.. అంతేకాదు సినిమా చూసిన వైఎస్ వీరాభిమానులను ఆఖరికి వైఎస్ కుటుంబంతో కూడా మహి కంటతడిపెట్టించాడు. ఇక మమ్ముట్టి విషయానికొస్తే.. ఆయన కెరీర్‌లో ఇదో మైల్‌స్టోన్‌గా ఉండిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు. 

ఇక అసలు విషయానికొస్తే.. ‘యాత్ర’లో కష్టపడి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన మమ్ముట్టి మరోసారి మరోసారి అదే సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. ‘వన్‌’ అనే చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ ‘వన్’ చిత్రాన్ని సంతోష్‌ విశ్వనాథ్‌ తెరకెక్కిస్తున్నాడు. కేరళ సీఎం కడక్కడల్‌ చంద్రన్‌గా మమ్ముట్టి నటిస్తున్నారు. అంటే ఇక్కడ తెలుగులో వైఎస్.. కేరళలో కడక్కడల్‌ చంద్రన్‌గా నటించే చాన్స్ మమ్ముట్టిదే అన్న మాట.

ఇక సినిమా నిర్మాణం విషయానికొస్తే.. ఇచైస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘వన్’ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సంయుక్త మేనన్, జోజ్‌ జార్జ్, మురళీ గోపాయ్, గాయత్రి అరుణ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సో.. మొత్తానికి చూస్తే మరోసారి మమ్ముట్టి ముఖ్యమంత్రి అవుతున్నాడన్న మాట. తెలుగులో యాత్రతో ఎనలేని అభిమానం సంపాదించుకున్న మమ్ముట్టి కేరళలో నంబర్ ‘వన్’ ముఖ్యమంత్రిగా నిలవాలని ఆశిద్దాం.



By November 27, 2019 at 12:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48437/mammootty.html

No comments