Breaking News

అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో దూరిన ఆకతాయి.. అమ్మాయిల కేకలతో పరార్


రాజధాని ఒంగోలులో ఓ ఆకతాయి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. సెయింట్ జేవియర్ కాలేజీ బాలికల హాస్టల్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు కనిపించడంతో అమ్మాయిలంతా కేకలు పెట్టారు. రాత్రి 12.30 గంటల సమయంలో ఓ యువతి బాత్‌రూమ్‌కు వెళ్తుండగా అక్కడ ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో ఆమె కేకలు పెట్టింది. Also Read: దీంతో హాస్టల్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చేటప్పటికీ అతడు పరారయ్యాడు. దీనిపై హాస్టల్ నిర్వాహకులు సోమవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం హాస్టల్‌కు చేరుకుని వార్డెన్, కాలేజీ ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు రక్షణ కల్పించడంతో కాలేజీ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. Also Read: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. రక్షణ లేని చోట పిల్లలను ఉంచలేమని చాలామంది చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీసుధ హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఆకతాయి ఎటు నుంచి హాస్టల్‌లోకి వచ్చాడో ఆరా తీశారు. అతడు ఏ అమ్మాయి కోసమైనా వచ్చాడా? లేక దొంగతనం చేసేందుకు వచ్చాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read:


By November 26, 2019 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/unidentified-man-enters-ladies-hostel-in-ongole/articleshow/72234180.cms

No comments