Breaking News

తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య


నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తను మహిళ తన కుమారులతో కలిసి రోకలిబండతో కొట్టి చంపేసిన ఘటన జిల్లా పట్టణంలో వెలుగుచూసింది. బద్వేలు పట్టణానికి చెందిన ఆంజనేయులు(45)కి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. Also Read: బేల్దారిగా పనిచేసే ఆంజనేయులు వచ్చిన సంపాదనంతా మద్యానికే వెచ్చిస్తున్నాడు. నిత్యం ఇంటికి తాగొచ్చి భార్య, పిల్లలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఫుల్లుగా తాగిచ్చిన ఆంజనేయులు భార్యతో గొడవ పెట్టుకుని చితకబాదాడు. భార్యతో పాటు పిల్లలపైనా రాళ్లు, కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో భర్తను ప్రతిఘటించిన నాగలక్ష్మి రోకలిబండతో అతడి తలపై బలంగా కొట్టింది. Also Read: తీవ్ర రక్తస్రావంతో ఆంజనేయులు అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు 108 సాయంతో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం అతడి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు పోలీస్‌స్టేషన్లో లొంగిపోయారు. Also Read:


By November 03, 2019 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadapa-woman-kills-husband-over-harassment/articleshow/71874248.cms

No comments