ఆ సెంటిమెంట్‌ను నమ్ముకున్న అర్జున్ సురవరం.. వర్క్ అవుట్ అవుతుందా!

చాలా కాలంగా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమా . సిద్దార్థ్, త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా కాలం అవుతుంది. అయితే టైటిల్ విషయంలో మొదలైన వివాదం తరువాత ఆర్ధిక సమస్యలు, సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవటం లాంటి ఇబ్బందులతో వాయిదా పడుతూ వస్తోంది. Also Read: తాజాగా ఈ సినిమాను నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సారి ఎలాంటి వెనకడుగు ఉండదు.. తప్పకుండా వస్తున్నాం అంటూ హీరో నిఖిల్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇన్ని వాయిదాత తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అర్జున్ సురవరం మెప్పిస్తాడా..? అసలు ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా కనితన్‌కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన టీఎన్ సంతోష్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ముందుగా ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఆ టైటిల్‌తో మరో సినిమా రిలీజ్ కావటంతో తప్పని సరి పరిస్థితుల్లో టైటిల్‌ను అర్జున్ సురవరంగా మార్చారు. Also Read: 2019 సమ్మర్‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మే 1న సినిమా రిలీజ్ అంటూ ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే కారాణాలు వెల్లడించకపోయినా రిలీజ్ వాయిదా పడింది. తరువాత మరో రెండు మూడు డేట్స్ ఇచ్చిన అవి అనుకున్నట్టుగా రిలీజ్ చేయలేకపోయారు. తాజాగా నవంబర్ 29 రిలీజ్ పక్కా అంటూ కన్‌ఫర్మ్ చేశారు. Also Read: అయితే గతంలో ఇలా వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు కొన్ని విజయాలు సాధించాయి. అత్తారింటికి దారేది, అర్జున్ రెడ్డి, టాక్సీవాలా లాంటి సినిమాలు ఇలాగే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని తరువాత ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తన సినిమాకు కూడా వర్క్ అవుట్ అవుతుందన్న ఆశతో ఉన్నాడు నిఖిల్. మరి నిఖిల్ ఆశలు ఎంత వరకు నెరవేరతాయో తెలియాలంటే మాత్రం 29 వరకు వెయిట్ చేయాల్సిందే. Also Read:
By November 17, 2019 at 10:16AM
No comments