పెళ్లయిన విషయం దాచి మరో యువతితో ప్రేమపెళ్లి.... కటకటాల్లోకి మోసగాడు

రెండేళ్ల క్రితం పెళ్లయిన యువకుడు.. తాజాగా మరో యువతిని ప్రేమ పేరుతో వెంటపడి రెండో పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. Also Read: వరంగల్‌జిల్లా పరకాల మండలానికి చెందిన పొలిపాక కార్తీక్(23) కొన్ని ఏళ్ల క్రితం కుటుంబంతో కీసర మండలం దమ్మాయిగూడలోని ఇందిరా గృహకల్ప ప్రాంతానికి వచ్చాడు. 2017లో అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో అతడికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టిన కార్తీక్ ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. 20రోజుల క్రితం ఆమెను వైజాగ్ తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుని కొద్దిరోజులు గడిపాడు. Also Read: కార్తీక్ తనకు తెలియకుండా తరుచూ ఫోన్ మాట్లాడటంతో అనుమానం వచ్చిన ఆ యువతి నిలదీయగా తనకు గతంలోనే పెళ్లి జరిగిందని చెప్పాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కార్తీక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By November 17, 2019 at 10:14AM
No comments