ప్రేమ విఫలమై పిచ్చోడిగా మారిన టెక్కీ... బంజారాహిల్స్‌లో ప్రజలపై రాళ్లదాడి
హైదరాబాద్‌లోని రోడ్ నంబర్ 3లో శుక్రవారం ఉదయం ఓ ప్రేమోన్మాది హల్‌చల్ చేశాడు. మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి వాహనదారులపై రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. దీంతో వాహనాలపై వెళ్తున్న వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కొందరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా కాసేపటికే వారు అక్కడికి చేరుకున్నారు. Also Read: ఆ వ్యక్తి పోలీసులపైనా రాళ్లు విసరడంతో గంటసేపటి తర్వాత చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి చేతులు వెనక్కి కట్టి తాళ్లతో బందించి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ వ్యక్తిని సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజుగా గుర్తించారు. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఐదెంకల జీతం అందుకున్న రాజు.. ఓ అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో మతి స్థిమితం కోల్పోయినట్లు తెలిసింది. ప్రేమ అనే రెండక్షరాలు అతడి వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసిందని తెలియడంతో అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: మతిస్థిమితం కోల్పోయిన రాజు కొద్దిరోజులుగా రోడ్ నంబర్ 3లో తిరుగుతున్నాడని, దొరికింది తింటూ రోడ్డు పక్కనే పడుకుంటున్నాడని కొందరు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఎవరికీ హాని తలపెట్టని అతడు హఠాత్తుగా ప్రజలపై రాళ్లు ఎందుకు రువ్వాడో తెలియడం లేదు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు రాజును పునరావాస కేంద్రానికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని మానసిక వైద్యశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By November 22, 2019 at 12:03PM
No comments