ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యం

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో దమ్ముగూడెం మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతి(19) మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. Also Read: ఈ నెల 15వ తేదీన తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన మట్టా శంకర్ అనే యువకుడు యువతిపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు శనివారం దమ్ముగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులకు శంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. యువతిపై అత్యాచారయత్నం ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆడబిడ్డలున్న తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By November 18, 2019 at 08:57AM
No comments