Breaking News

యువతి ఫోన్ నంబర్ పోర్న్ సైట్లలో పెట్టిన ఆకతాయి


ఓ యువతి ఫోన్‌ నంబర్‌ను పోర్న్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. చండీగఢ్‌కు చెందిన యువతి ఉన్నత విద్య అభ్యసిస్తోంది. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, వాట్సాప్‌లో చాలామంది అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తున్నారని, తమ కోరిక తీరిస్తే ఎంతైనా ఇస్తామంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు సెప్టెంబర్ 25న ఛండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఇప్పటివరకు 60 మంది వరకు కాల్స్, మెసేజ్‌లు చేశారని డేటా వారికి అందజేసింది. Also Read: దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ఫోన్ నంబర్‌ను ఎవరో పోర్న్ వెబ్‌సైట్లలో పెట్టి, పడక సుఖం కోసం అమ్మాయి కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని పోస్ట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం మూడు అశ్లీల వెబ్‌సైట్లలో యువతి ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించి వాటిని డిలీట్ చేయించారు. బాధితురాలికి కాల్స్, మెసేజ్‌లు చేసి వారి ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. Also Read: ఈ ఘటనలో ఎవరిపైనా అనుమానం లేదని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అయినప్పటికీ గుర్తితెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. అతడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. Also Read:


By November 04, 2019 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chandigarh-man-posts-young-woman-mobile-number-on-porn-sites-case-booked/articleshow/71886152.cms

No comments