Breaking News

పెళ్లి చేసుకోలేదని... ఫేస్‌బుక్ ఫ్రెండ్ ‌ హత్యకు ప్లాన్ వేసిన మహిళ


ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ పెళ్లి చేసుకోవాలని వేధిస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు. పోలీసులు సకాలంలో దర్యాప్తు చేయడంతో అతడి జరిగిన హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తేని వీరపాండి సమీపం కాట్టునాయక్కన్‌పట్టి ప్రాంతానికి చెందిన అశోక్‌కుమార్‌ (28) బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఆయన పని చేసేవాడు. అతడికి ఫేస్‌బుక్‌ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లపాటు స్నేహాన్ని కొనసాగించారు. వారి మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. Also Read: ఈ నేపథ్యంలో తనను వివాహం చేసుకోవాలని అశోక్‌కుమార్‌ను అముదేశ్వరి కోరింది. అయితే ఆమెకు తనకంటే ఎక్కువ వయసు ఉండటంతో ఇంట్లో అంగీకరించరని అతడు చెప్పారు. కొద్దిరోజుల తర్వాత మలేషియా నుంచి కవిత అనే మహిళ అశోక్‌కుమార్‌కు ఫోన్ చేసి తాను అముదేశ్వరి సోదరినని పరిచయం చేసుకుంది. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అముదేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. ఈ విషయం అశోక్‌కుమార్‌ పని చేసే సంస్థకు కూడా ఆమె ఫోన్ చేసి చెప్పడంతో అతడి ఉద్యోగం పోయింది. Also Read: దీంతో అశోక్‌కుమార్ తన ఊరికి తిరిగి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కవిత మలేషియా నుంచి తేనికి వచ్చిన తనను వివాహం చేసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అశోక్‌కుమార్‌ను బెదిరించింది. దీనిపై తేని జిల్లా ఎస్పీకి అశోక్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల దర్యాప్తులో అముదేశ్వరి, కవిత ఒక్కరేనని, ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి (45) అని తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు హెచ్చరించి పంపారు. Also Read: దీన్ని మనసులో పెట్టుకున్న ఆమె అశోక్‌కుమార్‌ను హత్య చేయించాలని విఘ్నేశ్వరి నిర్ణయించుకుంది. ఇందుకు ఫేస్‌బుక్‌ ద్వారా తేనికి చెందిన తొమ్మిది మందిని సంప్రదించి నగదు ఇస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. వారికి అశోక్‌కుమార్‌ ఫొటో, ఫోన్‌ నెంబరు పంపింది. ఆ తొమ్మిది మంది బోడిలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన లాడ్జి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By November 30, 2019 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/malaysia-woman-booked-for-murder-plan-on-tamilnadu-facebook-friend/articleshow/72303568.cms

No comments