Breaking News

పోలీస్ ఆఫీసర్‌గా నాగ్.. కాజల్‌ గ్రీన్ సిగ్నల్!


‘ర‌క్షణ‌’, ‘నిర్ణయం’, ‘శివ‌మ‌ణి’, ‘ఆఫీస‌ర్’ వంటి చిత్రాల్లో టాలీవుడ్ మన్మథుడు, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన విషయం విదితమే. అయితే మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ట్రెండ్‌కి తగిన సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ‘మన్మథుడు 2’ చేసిన నాగ్‌కు నిరాశే ఎదురైంది. అందుకే ఇక ప్రయోగాలు అక్కర్లేదని భావించిన ఆయన.. యంగ్ దర్శకుడు సాల్మన్‌‌ స్టోరీ లైన్ చెప్పగా ఓకే చెప్పేసినట్లు సమాచారం. పూర్తి కథ సిద్ధం చేసుకుని రా సాల్మన్.. అని నాగ్ చెప్పాడట. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో నాగ్‌ ముందు వరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే.

అయితే నాగ్ ఒప్పుకున్నారు సరే.. ఇక ఆయన సరసన నటించిందెవరు..? ఎవరైతే సెట్ అవుతారు..? అని నలుగురైదుగురు నటీమణులను చూసిన దర్శకుడు చివరికి కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసిందే. అంతేకాదు.. నాగ్ సరసన నటించాలని కాజల్‌ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సాల్మన్, నాగ్ భావిస్తున్నారట. కాగా.. ఇప్పటికే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మెప్పించిన కాజల్.. నాగ్ సరసన ఏ మాత్రం మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే మరి.



By November 30, 2019 at 01:23AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48491/kajal-aggarwal.html

No comments