Breaking News

మైనర్ బాలికలతో వ్యభిచారం.. విటుడు సహా ముగ్గురి అరెస్ట్


పశ్చిమబెంగాల్ రాజధాని నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. సౌత్‌జోన్ ఠాకూర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హోచిమిన్‌లో గల ఓ భవనంలో వ్యభిచారం జరుగుతున్న పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు శనివారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ విటుడితో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మైనర్‌ బాలికతో పాటు ఇద్దరు యువతులనురక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. Also Read: వ్యభిచార నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి యువతులు, బాలికలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు కోల్‌కతా సిటీ జాయింట్ కమిషనర్(క్రైమ్) మురళీధర్ శర్మ తెలిపారు. అనేక ప్రాంతాల్లో పేదరికంతో బాధపడే కుటుంబాలను ఈ ముఠా టార్గెట్ చేసుకుని వారి ఆడపిల్లలకు పని ఇప్పిస్తామని నమ్మించి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారని వెల్లడించారు. Also Read: మైనర్ బాలికలను అపహరించడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం, మహిళల అక్రమ రవాణా వంటి నేరాల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టినట్లు వెల్లడించారు. కోల్‌కతా నగరంలో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. Also Read:


By November 04, 2019 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-kolkata-3-arrested/articleshow/71886743.cms

No comments